జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్‌లోని తన నివాసంలో పార్టీ నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ ఉప ఎన్నికలో వెలువడుతున్న తాజా ఫలితాలు, కాంగ్రెస్ ఆధిక్యం వంటి అంశాలపై ఆయన పార్టీ నాయకులతో కీలక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.