ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన డీఆర్డీవో
BHNG: బీబీనగర్ మండలంలోని అన్నంపట్ల, ఎర్రబెట్టి తండా గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీవో నాగిరెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద రికార్డులను పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మీనా, సిబ్బంది పాల్గొన్నారు.