'వినాయక మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి'

NZB: నగరంలో వినాయక మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని పట్టణ సీఐ శ్రీనివాస రావు పేర్కొన్నారు. వినాయక్ నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో నాల్గో టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో వినాయక మండపాల నిర్వాహకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ మాట్లాడుతూ.. మండపాల వివరాలు పోలీస్‌శాఖ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు.