వైసీపీ ఆవిర్భావ దినోత్సవం.. స్పెషల్ వీడియో
AP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆశయ సాధనలో, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఈ ప్రస్థానం మరింత ముందుకు సాగాలని జగన్ కోరుకున్నారు. అలాగే, 'X'లో వైసీపీ ఓ వీడియోను విడుదల చేసింది. 'ఇది కేవలం ఒక పార్టీ జెండా కాదు, కోట్లాది మంది ప్రజలు తమ భుజాలెత్తి మోస్తున్న ఎజెండా' అనే క్యాప్షన్ ఇచ్చారు.