నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్
ADB: నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో డూప్లికేట్ సిగరెట్లను అమాయక ప్రజలకు విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ రమేష్ బుధవారం తెలిపారు. డూప్లికేట్ గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లను అమ్ముతున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.