'చెత్త సమస్యకు ప్లాస్మా టెక్నాలజీ శాశ్వత పరిష్కారం'
కోనసీమ: అమలాపురం వంటి డెల్టా ప్రాంతాలలో డంపింగ్ యార్డుల నిర్వహణకు స్థలాలు కొరత ఉన్నచోట్ల పెరుగుతున్న వ్యర్థాల సమస్యకు ప్లాస్మా టెక్నాలజీ ఒక శాశ్వత పరిష్కారమని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక డంపింగ్ యార్డును సందర్శించారు. ప్లాస్మా టెక్నాలజీతో తడి, పొడి చెత్తలను ప్రాసెసింగ్ చేసే యూనిట్ నిర్మాణాన్ని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.