పవన్ కళ్యాణ్ కోలుకోవాలని వాడపల్లి ఆలయంలో పూజలు
కోనసీమ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కొత్తపేట జనసేన ఇంచార్జ్, అమలాపురం పార్లమెంటరీ సమన్వయకర్త బండారు శ్రీనివాసరావు ఇవాళ కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడు ప్రదక్షణలు చేసి 111 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ పేరిట హోమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.