సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భారీగా ఆర్థిక సహాయం: ఎమ్మెల్యే సోమిరెడ్డి

NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం నెల్లూరు నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ విడతలో 58 మందికి దాదాపుగా రూ.46.75 లక్షలు మంజూరు అయినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే సోమిరెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.