రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కర్నూలు: దేవనకొండ మండలం గద్దె రాళ్ల గ్రామ ముఖద్వారం వద్ద మండలం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ఘటన చోటుచేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అప్రమత్తమైన వారు పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.