ఘనంగా ముందస్తు అంబేద్కర్ జయంతి వేడుకలు
ADB: సాత్నల మండలం జామిని ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ముందస్తుగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.