జమ్మూకశ్మీర్‌లో ముమ్మరంగా తనిఖీలు
జమ్మూకశ్మీర్ ఆసుపత్రుల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. కుల్లాం, యారిపోరా ప్రాంతాల్లో డాక్టర్ల గదులు, లాకర్లను సోదాలు చేస్తున్నాయి. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్న డాక్టర్ల కోసం గాలిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఢిల్లీ పేలుడు ఘటనలో డాక్టర్లకు సంబంధం ఉన్న నేపథ్యంలో ఈ తనిఖీలను ముమ్మరం చేశాయి.