15 నుంచి రుతుపవనాల తిరోగమనం: IMD

వాయవ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాలు ఈ నెల 15 నుంచి తిరోగమనం చెందనున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1న కేరళలో నైరుతీ రుతుపవనాలు ప్రారంభమై.. జూలై 8 వరకు దేశవ్యాప్తంగా వర్షాలు నమోదవుతాయి. సెప్టెంబర్ 17 నుంచి రుతుపవనాలు తగ్గుతూ అక్టోబర్ 15 నాటికి కనుమరుగవుతాయి. ఈ ఏడాది పశ్చిమ రాజస్థాన్ నుంచి ఈ నెల 15 నుంచే తిరోగమనం చెందనున్నట్లు IMD ప్రకటనలో తెలిపింది.