VIDEO: అధికారుల నిర్లక్ష్యంపై కౌన్సిలర్ల నిరసన

VIDEO: అధికారుల నిర్లక్ష్యంపై కౌన్సిలర్ల నిరసన

GDWL: గద్వాల మున్సిపాలిటీలో గురువారం బీఆర్ఎస్ కౌన్సిలర్లు కమిషనర్ ఛాంబర్ ముందు నిరసనకు దిగారు. మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు చివరి రోజైన నేడు, తమ పార్టీ అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించేందుకు కార్యాలయంలో ఎవరూ అందుబాటులో లేరని వారు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కమిషనర్ ఛాంబర్ ముందు ధర్నా చేపట్టారు.