ఆగిన పంచాయతీ భవన నిర్మాణ పనులు

ఆగిన పంచాయతీ భవన నిర్మాణ పనులు

NLG: చిట్యాల మండలం, బొంగోనిచెరువు గ్రామ పంచాయతీ భవన నిర్మాణం నిధుల లేమితో అర్ధాంతరంగా నిలిచిపోయింది. స్లాబ్ వరకు పనులు పూర్తయినప్పటికీ, పెండింగ్ బిల్లులు విడుదల కాలేదని గుత్తేదారు తెలిపారు. ప్రస్తుతం చిన్న గదుల్లోనే కార్యకలాపాలు సాగుతుండటంతో సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదనపు నిధులు కేటాయించి, పూర్తిచేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.