బైక్ అదుపుతప్పి ఇద్దరికి తీవ్ర గాయాలు
NLR: కందుకూరు మండలం మాచవరం PHC సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుడ్లూరు మండలం చిమిడిదిపాడుకు చెందిన సుమంత్, హర్ష కందుకూరు నుంచి బైక్‌పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బైక్ కరెంట్ పోల్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు వారిని వెంటనే ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.