రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న 

రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న 

AP: రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈనెల 16న యూరియా రాష్ట్రానికి చేరుకుంటుందని తెలిపారు. ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. రైతు సమస్యల పరిష్కరమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.