శ్రీలంకలో భారత 'చేతక్' రెస్క్యూ

శ్రీలంకలో భారత 'చేతక్' రెస్క్యూ

'దిత్వా' తుఫాన్‌తో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ ఆపద్బాంధవుడిలా మారింది. 'ఆపరేషన్ సాగర్ బంధు'లో భాగంగా.. INS విక్రాంత్ నుంచి చేతక్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. కష్టకాలంలో లంకకు అండగా నిలుస్తూ.. ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా భారత నేవీ సాహసం చేస్తోంది.