'సావిత్రి బాయి పూలే మహిళా లోకానికి ఆదర్శం'

'సావిత్రి బాయి పూలే మహిళా లోకానికి ఆదర్శం'

MLG: సావిత్రి బాయి పూలే మహిళా లోకానికి ఆదర్శమని కలెక్టర్ దివాకర అన్నారు. సావిత్రి బాయి జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళల పట్ల వివక్షతను తొలగించి వారిని విద్యావేత్తలు తీర్చిదిద్దిన మహనీయురాలన్నారు. అనంతరం మహిళా అధ్యాపకులు, ఉపాధ్యాయులను ఆయన సన్మానించారు.