భక్తి శ్రద్ధలతో వాసవి మాత జయంతి

భక్తి శ్రద్ధలతో వాసవి మాత జయంతి

MNCL: జన్నారం మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మీ సహిత నాగదేవత దేవాలయంలో ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ మాత జయంతిని నిర్వహించారు. బుధవారం వేద పండితులు గుండి గణేష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జక్కు భూమేష్ ఉన్నారు.