'అధికారులకు స్వీట్లు పంచిన కూటమి నేతలు'

CTR: తంబళ్లపల్లె ప్రభుత్వ కార్యాలయాలలోని ప్రభుత్వ అధికారులకు కూటమి నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. రాష్ట్రంతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా మండలంలోని ఎంపీడీవో, ఐకేపీ, ఉపాధి హామీ, తహశీల్దార్ కార్యాలయాలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలలోని అధికారులకు టీడీపీ మహిళా నాయకురాలు సిద్ధమ్మ ఆధ్వర్యంలో స్వీట్లు పంచిపెట్టారు.