కడప డిగ్రీ కాలేజీలో న్యాయ విజ్ఞాన సదస్సు

KDP: ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ సూచించారు. కడపలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు మంగళవారం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం, ఆర్టికల్ 47, డ్రగ్ & కాస్మెటిక్స్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ 1985, సర్టిఫికెట్ల జారీ, లీగల్ సర్వీసెస్, హెల్ప్ లైన్ 15100 అంశాలపై అవగాహన కల్పించారు.