మహిళల భద్రతపై అవగాహన ర్యాలీ

మహిళల భద్రతపై అవగాహన ర్యాలీ

ASR: దేశ అభివృద్ధికి మహిళల భద్రత, విద్య ముఖ్యమని పాడేరు డీఎస్పీ అభిషేక్ పేర్కొన్నారు. శనివారం అరకులోయలో ఎస్సై గోపాలరావు ఆద్వర్యంలో మహిళల భద్రతపై పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన కూడలి వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఆడపిల్లలకు విద్యా, పౌష్టికాహారం ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళలకు సమస్యలు ఉంటే పోలీసులకు తెలపాలన్నారు.