యూరియా పంపిణీని తనిఖీ చేసిన.. SP

MHBD: గార్ల మండలం ముల్కనూరు గ్రామంలోని రైతు వేదికలో జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా పంపిణీ సజావుగా, వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సీఐ రవికుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.