ZPHS పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోటకదిర గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను మహబూబ్ నగర్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.