VIDEO: పెనుకొండలో టీడీపీ నాయకుల సంబరాలు

VIDEO: పెనుకొండలో టీడీపీ నాయకుల సంబరాలు

సత్యసాయి: అమరావతి బిల్లుకు ఆమోదం లభించడంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెనుకొండలో టీడీపీ నాయకులు గురువారం పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. మంత్రి సవిత మాట్లాడుతూ.. అమరావతి కోసం ప్రజలు చేసిన దీర్ఘకాల పోరాటం ఫలించిందని తెలిపారు. ఇకపై ఎవరు వచ్చినా అమరావతిని కదిలించలేరని ఆమె స్పష్టం చేశారు.