'నిర్ణీత గడువులోగా అర్జీలకు పరిష్కారం చూపాలి'

NTR: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఇలక్కియతో కలిసి ప్రజల నుంచి వినతులు సేకరించారు. నమోదయ్యే అర్జీలు పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. అర్జీలను అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు.