లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం

VZM: చందూర్ మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ సేవ కేంద్రములో స్వఛ్చభారత్ లో భాగంగా శనివారం లయన్స్ సభ్యులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.