శ్రీరామ్ సాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

JGL: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ నిండు కుండను తలపిస్తోంది. బుధవారం ఉదయం 7 గంటల సమయానికి 54,545 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. అటు ప్రాజెక్టులో 80.5 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 8 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు.