VIDEO: నడిరోడ్డుపై కొట్టుకున్న పోలీసులు
UP ఫరూఖాబాద్‌లో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు నడిరోడ్డుపై కొట్టుకున్న వీడియో SMలో వైరల్ అవుతోంది. అక్రమంగా వసూలు చేసిన మామూళ్లలో ఒకరు రూ.5,000 వసూలైందని, మరొకరు రూ.2,800 మాత్రమే వచ్చాయని వాదించారు. ఈ గొడవ కాస్తా తన్నులాటగా మారింది. యూనిఫామ్‌లో ఉండి అవినీతికి పాల్పడుతూ, వీధి రౌడీల్లా ప్రవర్తించడం వ్యవస్థకే తీరని అవమానం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.