యాక్సిడెంట్.. ఒకరు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు

SRD: సరళ మైసమ్మ ఆలయానికెళ్లి తిరిగి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మేట్ PS పరిధి ORRపై కారు ప్రమాదానికి గురైంది. జిన్నారంలోని వావిలాలకు చెందిన R. సౌమ్య రెడ్డి (25), స్నేహితులు నందకిషోర్, వీరేంద్ర, శ్రుతితోపాటు మొత్తం 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌమ్య రెడ్డి, నందకిషోర్లను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా సౌమ్య మరణించింది.