కాంగ్రెస్‌లోకి సీనియర్ నేత వీరేందర్ రెడ్డి

కాంగ్రెస్‌లోకి సీనియర్ నేత వీరేందర్ రెడ్డి

VKB: సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎ.వీరేందర్ రెడ్డి తిరిగి పార్టీలో చేరారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న ఆయన, గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డా.టి.రామ్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఈరోజు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.