'నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు'

WNP: నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని రేవల్లి మండల ఎస్సై రజిత అన్నారు. ఫర్టిలైజర్ షాపుల ముందు విత్తనాల ధరల పట్టికను ఏర్పాటు చేయాలని, డీలర్ షాప్ లైసెన్స్ వివరాలను ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తనాలు ఎరువులను విక్రయించాలన్నారు. డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని అన్నారు.