ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

MDK: హవేలీ ఘనపూర్ మండలం సర్ధన గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. వరదల కారణంగా గ్రామంలో జ్వరాలు వంటి వ్యాధుల పరిస్థితి గురించి గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు.