కొమెరపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కన్నా

పల్నాడు: సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కన్నా మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైంది, సంపద దోపిడీ జరిగింది, ప్రజాస్వామ్యం రాక్షసుల దాడికి గురైంది, జగన్ చేసిన మోసం చాలు.. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపుదాం అన్నారు.