'యూరియా కోసం ఆందోళన వద్దు'

AKP: గొలుగొండ మండలం జోగుంపేట రైతు సేవా కేంద్రం వద్ద శనివారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. మండల టీడీపీ మాజీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు మాట్లాడుతూ.. రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదనన్నారు. మండలానికి అదనంగా మరో 80 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సీతారామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.