VIDEO: పెద్ద పులుగు వారి పాలెంలో అగ్నిప్రమాదం
BPT: కర్లపాలెం మండలం పెద్ద పులుగు వారి పాలెం గ్రామంలో పులుగు సులోచన ఇంటిలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లో ఉన్న రొయ్యల చెరువులకి సంబంధించిన నగదు, బంగారం పూర్తిగా బూడిదైనట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం సహాయం అందించాలని బాధిత కుటుంబం కోరుతోంది.