భారతీయ విద్యార్థులకు కెనడా షాక్!
కెనడాలో భారతీయ విద్యార్థులకు గట్టి షాక్ తగులుతోంది. ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకుంటున్న భారతీయ విద్యార్థుల వీసాలను కెనడా భారీగా తిరస్కరిస్తోంది. ఈ స్టడీ పర్మిట్ దరఖాస్తుల్లో 2023లో 32శాతం ఉండగా.. 2025 ఆగస్టులో 74 శాతం ఉందని కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ గణాంకాలు చెప్పాయి. 2023లో 20,900గా ఉన్న దరఖాస్తుల సంఖ్య 2025 ఆగస్టు నాటికి 4,515కు తగ్గాయట.