వర్షాకాలానికి జీహెచ్ఎంసీ ముందస్తు ఏర్పాట్లు

HYD: వర్షాకాలానికి జీహెచ్ఎంసీ ముందుగానే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో సంభవించనున్న వరదలు, నాలాలు పొంగిపొర్లడం, లోతట్టు ప్రాంతాల ముంపు, వాటర్ లాగింగ్ పాయింట్లలో తీసుకునే చర్యలపై బల్దియా యాక్షన్ ప్లాన్ రూపొందించే పనిలో నిమగ్నమైంది. వర్షాకాలంలో సంభవించే పరిణామాలు, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు, తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తుంది.