'అత్యవసర సమయంలో 100కు సంప్రదించండి'

ADB: అత్యవసర సమయాల్లో ప్రజలు డయల్ 100కు సంప్రదించాలని పోలీసులు సూచించారు. మంగళవారం సిరికొండ మండలంలోని వాయిపేట్ గ్రామంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా దొంగతనం, గంజాయి స్వీకరణ, రోడ్డు, అగ్ని ప్రమాదాల కోసం పోలీస్ సిబ్బందికి సంప్రదించాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో అవినాష్, సుధాకర్, జ్ఞనేశ్వర్, గోపాల్, భాస్కర్, దిలీప్, లక్ష్మణ్ ఉన్నారు.