మారేడుమిల్లిలో పాఠశాల భవనాల కొరత
ASR: మారేడుమిల్లి మండలంలో 14 ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన శాఖకు చెందిన దొరచింతలపాలెం, ముసురు, గొందివాడ, కేచ్చలవాడ, వేజువాడ, తుర్రవాక, పాముగండి, గుడిసెలోనూ.. ఎంపీపీ పరిధిలోని గంపేనగండి, ఎగవలస, పొట్లవాడ, వైదపూడి, ధరవాడ, పెద్దురు పాఠశాలలకు భవనాలు లేవు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.