భార్యాభర్తల మధ్య గొడవ.. ఇంటికి నిప్పంటించిన భర్త

SRCL: భార్యా భర్తలు గొడవ పెట్టుకుని ఇంటిని దగ్ధం చేసిన ఘటన తంగళ్లపల్లి మండలం పద్మానగర్‌లో జరిగింది. స్థానికుల ప్రకారం.. బాల పోశయ్య, రాజేశ్వరి అనే దంపతులు శనివారం ఇంట్లో గొడవ పడ్డారు. భర్త తీవ్ర ఆగ్రహానికి గురై భార్యపై, ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు స్వల్ప గాయాలు కాగా.. ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది.