శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
విజయనగరం జిల్లా బొబ్బిలిలోని శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే రంగారావు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాముడి జీవితం, ఆయన చూపిన ధర్మ మార్గం అందరికీ ఆదర్శమని, సమాజంలో నైతిక విలువలు పెరగాలంటే రాముడి ఆశయాలు అవసరమన్నారు. రాముడు ఆదర్శ పురుషుడిగా, కర్తవ్య పరాయణుడిగా నిలిచారని, రామరాజ్యం స్థాపన కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.