ఇంటర్ అడ్మిషన్ల దరఖాస్తుల స్వీకరణ

GDWL: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నోడల్ అధికారి హృదయ రాజు తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన, ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 12 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ కళాశాలల్లో రూ. 500 అపరాధ రుసుముతో అడ్మిషన్ పొందవచ్చని, అయితే గురుకుల, కేజీబీవీ కళాశాలల్లో ఎటువంటి అపరాధ రుసుము లేదని స్పష్టం చేశారు.