VIDEO: శ్రీకాకుళంలో కళ్ళకు గంతలు కట్టుకుని CHOల నిరసన

SKLM: ఆరోగ్యశాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న CHOలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపడుతున్న ధర్నా కార్యక్రమం సోమవారం కూడా కొనసాగింది. శ్రీకాకుళం-పొన్నాడ రోడ్డులోని జ్యోతీరావు పార్కు వద్ద కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. పెండింగ్ ఇన్సెంటీవ్స్ తక్షణమే విడుదల చేయాలని, ఆయుష్మాన్ భారత్ నిబంధనల మేరకు తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.