శ్రీమఠం అన్నదానానికి విరాళం
KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన పథకానికి రూ. 2.30 లక్షలు విరాళంగా వచ్చిందని మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన సుందర్ రాజు ఇచ్చినట్లు పేర్కొన్నారు. విరాళం ఇచ్చిన భక్తుడికి శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. అనంతరం పీఠాధిపతి ఫలమంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.