రాజోలిలో 64 ట్రాక్టర్ల ఇసుక సీజ్..!

రాజోలిలో 64 ట్రాక్టర్ల ఇసుక సీజ్..!

GDWL: రాజోలి మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన 64 ట్రాక్టర్ల ఇసుకను తహసిల్దార్ రామ్మోహన్, ఎస్సై గోకారి ఆధ్వర్యంలో బుధవారం సీజ్ చేశారు. రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న అక్రమ ఇసుక నిల్వలను రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి సీజ్ చేశారు. గురువారం రాజోలి ఎస్సై గోకారి మన ఇసుక వాహనం ట్రాక్టర్ల ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్ చేసుకున్న వారికి తరలించారు.