మున్సిపల్ అభివృద్ధికి రూ. 30 కోట్లు మంజూరు

మున్సిపల్ అభివృద్ధికి రూ. 30 కోట్లు మంజూరు

మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 30 కోట్లు మంజూరు చేసినట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో మున్సిపల్ అభివృద్ధి, ప్రజా సేవా కార్యక్రమాలు మరింత వేగంగా అమలవుతాయని వివరించారు. మెదక్ పురోగతి కార్యక్రమాలకు చురుకైన నాయకత్వం ప్రధాన కారణమని ప్రజలు అభినందిస్తున్నట్లు ఆయన వివరించారు.