కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
JN: పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ. 24,02,784 విలువైన చెక్కులను ఎమ్మెల్యే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలుస్తూ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా ఆర్థిక భారం తగ్గించేందుకు కృషి చేస్తోందన్నారు.