ఏయూలో విజిలెన్స్ విచారణ.. ఉద్యోగుల్లో అసంతృప్తి
VSP: ఏయూలో గత ప్రభుత్వ అవకతవకలపై ప్రస్తుత ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ఆదేశించింది. 20 ఉన్నతాధికారులపై 15 రోజుల పరిశీలన జరిగింది. అప్పటి కొంతమంది అధికారులు బదిలీ అవ్వగా, కొంతమంది పదవీ విరమణ పొందారు. అయినప్పటికీ, కింది స్థాయి ఉద్యోగులపై సంబంధం లేని వివరాలను కోరుతూ ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.