ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి
KMM: ఏన్కూరు మండలంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య మంగళవారం తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, బిల్లులను పరిశీలించి.. గడువు ముగిసిన మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ.. ఫార్మర్ రిజిస్ట్రీ, పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.